AP: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆళ్వాల్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TTD ఛైర్మన్ BR నాయుడు మాట్లాడుతూ.. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సాధారణంగా ఉగాది, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.