KRNL: హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల రైతులకు హెచ్చరిక చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పశువుల గడ్డివాముల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గడ్డివాముల సమీపంలో విద్యుత్ తీగలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదం జరిగితే టోల్ ఫ్రీ 101 లేదా ఫైర్ కంట్రోల్ నంబర్ 9100108101కు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.