CTR: వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోవాలని పుంగనూరు వ్యవసాయ శాఖ AD శివ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో AO రాధ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం జరిగింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రాబోయే ఖరీఫ్ సీజన్లో చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. కావున నీటిని పొదుపుగా వాడాలన్నారు.