AP: వైసీపీ పాలనలో కల్తీ మద్యం వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని, మద్యం బలహీనత ఉన్నవారిని ఆ పార్టీ నేతలు లూటీ చేశారని ఆయన మండిపడ్డారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.