VZM: యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరరావు పిలుపునిచ్చారు. మంగళవారం రాజీవ్ క్రీడా మైదానంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 22న గురజాడ కళాభారతిలో “మిస్టర్ VZM-2026” బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 55 నుంచి 75 కేజీల వరకు 6 కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయని చెప్పారు.