ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేసిన చోటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయాలని CPI ML న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈ నెల 22న ఖమ్మం బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, వివిధ వ్యాపార వర్గాల నిర్వాహకులు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.