WGL: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి కలిసి వినతిపత్రం అందజేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్, ఇతర పనుల నిర్వహణకు 250 మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించేందుకు మంజూరు ఇవ్వాలని సీఎంను వారు కోరారు.