KRNL: దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన ఎల్.ప్రేమనాథరెడ్డి వైసీపీ స్టేట్ పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.