WNP: మదనాపురం మండలంలోని దంతనూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బండారు కృష్ణయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకొన్న దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి వారి నివాసానికి చేరుకున్నారు. అనంతరం అతని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.