పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ.137 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.140 కోట్ల షేర్ వసూళ్లు సాధించాల్సి ఉంది. గ్రాస్ పరంగా చూస్తే రూ.225 కోట్లు రాబట్టాల్సిందే.