T20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన భారత జట్టుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టులో ప్రపంచ స్థాయి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారని.. గత 5-6 ఏళ్లుగా ICC టోర్నీల్లో ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు. దీనికి IPL ఒక కారణమని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో జరిగే IPLను నిరంతరం ఆడటం ద్వారా ఆటగాళ్లకు అపారమైన అనుభవం పొందారని చెప్పారు.