NZB: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోపాల్ బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు శశాంక్ రెడ్డి మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, పెన్షన్ల పెంపు వంటి వాగ్దానాలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.