PPM: జిల్లాలో జర్నలిజం నాణ్యతను పెంచేలా వార్తలు ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, పొరుగు జిల్లాల కంటే బిన్నంగా, నాణ్యమైన జర్నలిజం ఉండాలని ఆకాంక్షించారు. నెగెటివ్ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే ప్రజలకు ఉపయోగపడే వార్త కథనాలు ఉండాలని సూచించారు.