ADB: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్ నియోజకవర్గానికి చేసిన సేవలు మరువలేనివని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. గోవింద్ నాయక్ మృతి పట్ల ఆమె ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉట్నూర్ మండలంలోని గోవింద్ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల కోసం అంకితభావంతో సేవలందించిన ప్రజానాయకుడని కొనియాడారు.