దర్శకుడు శేఖర్ కమ్ముల, నాని కాంబోపై వస్తున్న వార్తలు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి. శేఖర్ కమ్ముల మార్క్ సున్నితమైన ‘క్లాస్’ కథను నాని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ వంటి చిత్రాలతో ప్రస్తుతం నాని ‘మాస్’ ఇమేజ్‌పై దృష్టి పెట్టాడట. తన ప్రస్తుత మార్కెట్ లెక్కల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.