TG: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో ఓ భర్త కట్టుకున్న భార్యను హతమార్చాడు. 8 నెలల క్రితం హరిబాబు వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో.. భార్య నాలుగు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.