NTR: వీరులపాడు (M) జుజ్జూరులో పారిశుద్ధ్యం పడకేసింది. ముఖ్యంగా హరిజనవాడలో సీసీ రోడ్లు నిర్మించినా, సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోతోంది. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోందని, రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.