KDP: జమ్మలమడుగు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనుందని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశంలో పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల గురించి సమావేశంలో చర్చించనున్నారని అన్నారు. అలాగే మార్చి 31 తేదీలోపు ఇంటి పన్నులు, నీటి పన్నులు ప్రజలు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలన్నారు.