రాజస్థాన్ రాయల్స్‌ను వీడడంపై సంజూ శాంసన్ తొలిసారి స్పందించాడు. జట్టులో తన సమయం ముగిసిపోయిందని భావించడంతోనే వైదొలిగినట్లు తెలిపాడు. IPL 2026లో రాజస్థాన్‌తో జరిగే పోరులో తన ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని.. తొలిసారి RRకు ప్రత్యర్థి ఆటగాడిగా బరిలోకి దిగబోతున్నట్లు చెప్పాడు. గత IPL ముగిసిన అనంతరం శాంసన్ RRను వీడి చెన్నై జట్టులో చేరిన విషయం తెలిసిందే.