KRNL: పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామంలో ఉపాధి హామీ పనులను టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ యంకన్న మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని కూలీలందరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూలీలెవరూ వలసలు వెళ్లొద్దని హితవు పలికారు. ఇందులో టీడీపీ నేతలు భీమన్న, కాశీం, బుల్లప్ప, రోగన్న, దేవసహాయం, జనసేన నేతలు బజారి, హుసేని ఉన్నారు.