NDL: నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభోత్సవానికి ముందే తొలగించడం రాజకీయ దుమారం రేపింది. కొందరు నాయకుల పేర్లు లేకపోవడం, మరికొందరి పేర్లు తప్పుగా ముద్రించడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనతో పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొనగా, అధికారులు సవరణలు చేపట్టి మళ్లీ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.