NRML: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి ప్రజలు హాజరై తమ వినతులు, ఫిర్యాదులు సమర్పించాలని ఆమె సూచించారు.