అరుణాచల్‌ప్రదేశ్ ఇటానగర్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్న భవన రక్షణ గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి గోడ కూలడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతులను చోకి తసర్(23), గోడక్ రాజా(30), గోడక్ తబిన్(35), రతన్ బర్మన్ (26)గా పోలీసులు గుర్తించారు.