NRPT: నారాయణపేట్ మండలంలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పథకంలో భాగంగా 2 వీలర్ 90 శాతం, 3 వీలర్‌కు 70 శాతం సబ్సిడీ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడించారు.