ASR: కొయ్యూరు మండలం కితలోవ, రావణాపల్లి గ్రామాల్లో రేపు మెగా ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కిల్లో ఊర్మిళ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్ధిక సహాయంతో నిర్వహించే ఈ వైద్య శిబిరాల్లో పశు వైద్యులు, సిబ్బంది పాల్గొని ఆవులు, మేకలు, గొర్రెలు, పాడి పశువులకు వైద్య సేవలు అందిస్తారన్నారు.