BHPL: దశాబ్దాలుగా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుల పై రన్నింగ్ టెస్ట్ నిర్వహించడం సరికాదని, వెంటనే ఆ పరీక్షలను రద్దు చేయాలని AITUC నాయకులు డిమాండ్ చేశారు. BHPL ఏరియాకు చెందిన గార్డులతో కలిసి కొత్తగూడెంలోని జీఎంకు వినతిపత్రం అందజేశారు. AITUC నాయకులు మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన గార్డులను శారీరక పరీక్షలతో వేధించడం అన్యాయమని అన్నారు.