SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈనెల 19వ తేదీ గురువారం ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ శివార్చన వేదికపై స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు.