AP: రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. కొత్త ఎన్నికలపై స్థానికంగా చర్చలు మొదలయ్యాయి. పలు గ్రామాల్లో ఇప్పటికే కొత్త అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. యువత, మహిళలు కూడా ఈసారి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశముంది.