అమెరికాలోని (America) పెన్సిల్వేనియాలో దారుణ ఘటన జరిగింది. అల్ఫారటా రహదారిలో వేగంగా వస్తున్న ఒక కారు కల్వర్టు(Culvert)ను ఢీకొట్టి సమీపంలో ఉన్న ఓ ఇంటి మొదటి అంతస్తు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలిసులు (Police) ఘటనా స్థలానికి చేరకొని అతికష్టం మీద కారును కిందకి దించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఇంటికి పెద్ద రంధ్రం ఏర్పడింది.
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్గా మారడంతో నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ‘వావ్ భలేగా ఎగిరిందే’ అని ఒకరు. ‘ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏం కానందుకు సంతోషం’అని మరొకరు ‘అరే, మీరు పైకి ఎలా వచ్చారు?’ అంటూ ఇంకొకరు.. ఇలా కామెంట్లు పెడుతున్నారు.వాహనాలు గాల్లో ఎగరడాన్ని సాధారణంగా యాక్షన్ సినిమా(Action movie)ల్లో చూస్తుంటాం. కానీ, ఒక కారు ఏకంగా ఓ ఇంటి మొదటి అంతస్తు పైకి దూసుకెళ్లింది.