AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. మూడో రోజు విచారణలో భాగంగా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.