సత్యసాయి: పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఇవాళ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో ముఖ్యమైన సూచనలు అందించారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర, తదితరులు పాల్గొన్నారు.