ASR: చింతూరు మండలం సింగనగూడెం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్‌కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.