GDWL: డిజిటల్ క్రాఫ్ట్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ పక్కాగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని గోనుపాడు శివారులో పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంటల దిగుబడి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మరో నెల రోజుల్లో అన్ని పంటలు చేతికి వస్తాయని రైతులు తెలిపారు.