అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో వస్తున్న ‘వృషకర్మ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చైతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా చివరి 25 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు చూడని సరికొత్త అంశాన్ని క్లైమాక్స్‌లో చూపించబోతున్నామని చెప్పాడు.