పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పవన్ టీం సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్ మైలురాయి ‘తొలిప్రేమ’లోని ‘ఈ మనసే’ సాంగ్‌ను ఇందులో రీ-క్రియేట్ చేసినట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ సాంగ్ రీమిక్స్ వెర్షన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.