AP: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. ‘కోడి కోస్తే నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. డ్రగ్స్ కేసులో ఎంపీ దొరికితే రక్షిస్తారా? హాట్లైన్లోకి వెళ్లి బెయిల్ ఇప్పిస్తున్నారు. ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ డిమాండ్ చేశారు.