సత్యసాయి: పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మంత్రి సవిత అన్నారు. అమరజీవి 125వ జయంతి సందర్భంగా తాడేపల్లిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరాములు పట్టుదల, త్యాగం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అమరావతిలో అమరజీవి స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.