సత్యసాయి: పరిగిలో మంత్రి సవిత ఆదేశాల మేరకు క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జ్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద రైతుల ఖాతాల్లో జమ అయిన నిధుల విషయాన్ని ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి సూచించారు. అనంతరం ఇంటింటికి రైతులను కలిసి పథకాలపై అవగాహన కల్పించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.