CTR: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు ఎస్డీపీఓ టి. సాయినాథ్ సోమవారం గ్రీమ్స్పేటలోని శ్రీ చైతన్య, నారాయణ, లిటిల్ ఫ్లవర్, మున్సిపల్ హై స్కూల్లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీసులకు సూచనలు చేశారు.