GNTR: ఫిరంగిపురం పరిధిలోని విజ్ఞానపురం కాలనీలో డ్రైనేజ్ కాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో జంతువుల మృతదేహాలు కుళ్లిపోతుండటంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. పాములు, దోమల బెడద పెరుగుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి కాలువలను శుభ్రం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.