వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నందిహిల్స్ కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు చిన్నపిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుక్కల దాడి భయంతో బయటకు రావాలంటేనే మహిళలు వణికిపోతున్నారు. పురపాలక అధికారులు తక్షణమే స్పందించి, ఈ కుక్కల సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని స్థానికులు కోరారు.