పల్నాడు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పరీక్షల నేపథ్యంలో నరసరావుపేటలోని మునిసిపల్ బాయ్స్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పర్యవేక్షణ చేశారు.