AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎవరూ ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. ‘మీరే మన రాష్ట్ర భవిష్యత్తు. పరీక్షల మీద దృష్టి పెట్టండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని పోస్టు చేశారు.