టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్ర హీరోలు సిమాలు చేస్తు తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)ని ఏలుతున్నారు. వారసత్వం పరంపరం కొనసాగుతుంది. అదే విధంగా కొందరు హీరోలు పరిస్థితి ఒక అడుగు ముందు వేస్తే మూడు అడుగులు వెనక్కి అనే విధంగా ఉన్నాయి. ఒక్క సినిమా హిట్ అయితే వరుసగా మళ్లీ ఒకటి రెండు సినిమాలు ప్లాఫై ఒక సినిమా హిట్ అవుతుంది. ఈ విధంగా పడుతూ లేస్తూ సరైన స్టార్డం లేక టాలీవుడ్ (Tollywood) లో కొనసాగుతున్నటు వంటి హీరోల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..
1. అల్లరి నరేష్
అల్లరి నరేష్ (Allari Naresh) ఒకప్పుడు కామెడీ సినిమాలకు పెట్టింది పేరు.ప్రతి మూవీలో అతను పండించే హాస్యం బాగుండేది. సంవత్సరంలో ఐదు నుంచి ఆరు సినిమాలు వచ్చేవి. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈయన సినిమాలు మినిమం సక్సెస్ అయ్యేవి. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఈయన సినిమాలు హిట్ కావడం లేదు. దీంతో స్టార్డం కోసం ఎదురు చూస్తున్నాడు.
2. ఆది పినిశెట్టి
విలన్ పాత్రల్లో అదరగొడుతున్న ఆది పినిశెట్టి హీరోగా సక్సెస్ కావటంలేదు. రంగస్థలం (Rangasthalam) , సరైనోడు, యూటర్న్ సినిమాల్లో అద్భుతంగా నటించాడు. ఆయన నీవెవరు అనే మూవీలో హీరోగా చేశాడు. కానీ అనుకున్నంత హిట్ అవ్వలేదు. దీంతో స్టార్డం కోసం ఎదురు చూస్తున్నాడు.
3. సుధీర్ బాబు
ప్రేమ కథా మూవీతో హీట్ అందుకున్న సుధీర్ బాబు (Sudhir Babu) ఐదేళ్ల విరమం తర్వాత సమ్మోహనంతో మళ్లీ సక్సెస్ కొట్టాడు. ఆ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు వచ్చినా సరైన హిట్ అందుకోలేదు. దీంతో ఈయన కూడా స్టార్డం కోసం ఎదురుచూస్తున్నాడు.
2011 సంవత్సరంలో క్రికెట్ గర్ల్ అండ్ బీర్ అనే మూవీ చేశాడు. కానీ ఇది ఫ్లాఫ్ అయింది. ఆ తర్వాత చందమామ కథలు
(Chandamama stories),ఊహలు గుసగుసలాడే ఓ మోస్తారు హిట్ కొట్టాయి. ఆ తర్వాత వరుస ప్లాఫ్ లు రావడంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు..
5. నవదీప్
జై తో హీరోగా క్రెడిట్ తెచ్చుకొని గౌతమ్ ఎస్ఎస్సి(Gautham S.Sc), చందమామ వంటి మూవీలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాఫ్ అవ్వడంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
6. సందీప్ కిషన్
ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసినా సరైన స్టార్డమ్ రాక సతమతమవుతున్నాడు సందీప్ కిషన్(Sandeep Kishan). 2010లో ప్రస్థానం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సందీప్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్లు లేవు. ఎన్ని ప్రయోగాలు చేసినా..సందీప్ ను హిట్టు వరించడంలేదు. దాంతో ఆఈసారి ఎలాగైన సాలిడ్ సక్సెస్ సాధించాలి అనన పట్టుదలతో ఉన్నాడు
7. మంచు విష్ణు
మోహన్ బాబు కొడుకుగా ఎంతో పాపులారిటీ ఉన్నా కానీ వీరు ఇండస్ట్రీలో స్టార్డం తెచ్చుకోలేకపోతున్నారు. 2003లో వచ్చిన విష్ణు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు (Manchu Vishnu) ఢీ అనే సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఎలాంటి హిట్ లేదు. దీంతో ఇండస్ట్రీలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని ట్రై చేస్తున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు