AKP: మాకవరపాలెం మండలం జి.వెంకటాపురం గ్రామానికి చెందిన పోలవరపు రాంబాబు (45) కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగించేవాడు. సోమవారం ఉదయం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.