SKLM: శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు శ్రీకాకుళం మీదుగా చర్లపల్లి-సాలిమార్-చర్లపల్లి(17065/66)మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైలు సర్వీసులు ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లాలో పలు స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.