చక్కగా స్కూల్ కి వెళ్లి బుద్ధిగా పాఠ్య పుస్తకాలు చదువుకోవాల్సిన విద్యార్థులు దారి తప్పుతున్నారు. ఊహకు అందని రీతిలో వయసుకి మించిన పనులు చేస్తున్నారు. నీచమైన పనులతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా రాజస్తాన్ లోని(Rajasthan) బిల్వారా జిల్లా లుహారియా(Luhariya) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థిని వాటర్ బాటిల్లో తోటి విద్యార్థులు మూత్రం పోసిన అమానుష ఘటన లుహారియా ప్రభుత్వ బడిలో జరిగింది.
అంతటితో ఆగకుండా ఆమె బుక్లో లవ్ యూ అని రాసి పెట్టారు. మూత్రం పోసిన విషయం తెలియక ఆ అమ్మాయి బాటిల్లోని నీరు తాగింది. దుర్వాసన రావడంతో హెచ్ఎం(Hm) కు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలిక పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.తన తరగతికే చెందిన ఇద్దరు విద్యార్థులపై బాలిక అనుమానం వ్యక్తం చేసింది. ఈ పని వారే చేసి ఉంటారని భావిస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇరువర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో స్కూల్ (School) దగ్గరికి చేరుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.