TG: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం వైభవంగా నిర్వహించారు. 3 నెలలుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు అగ్నిగుండ ప్రవేశంతో ముగించారు. భారీగా తరలొచ్చిన భక్తులు నిప్పులపై నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత అగ్నిగుండానికి భూమిపూజ చేశారు. భద్రకాళీ మాత అష్టోత్తర శతనామ పూజతో అగ్నిప్రతిష్ఠ చేశారు. ఒక్కొక్కరిని అగ్నిగుండంలోకి అనుమతించారు.