ఎవరికైనా విషం ఇస్తే, ఆ విషం కేవలం ఆ ఒక్క వ్యక్తి ప్రాణాన్ని మాత్రమే తీస్తుంది. కానీ, నిర్ణయాలు తీసుకునే నాయకుడికి ఎవరైనా ‘చెడు సలహా’ ఇస్తే.. ఆ తప్పుడు సలహా ఏకంగా ఒక రాజ్యాన్ని, కుటుంబాన్ని సమూలంగా నాశనం చేస్తుందని విదురుడు హెచ్చరించారు. బయట ఉండే శత్రువుల ఆయుధాల కంటే, మన పక్కనే ఉంటూ స్వార్థంతో తప్పుడు సలహాలు ఇచ్చే వారితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుందని విదుర నీతి సారాంశం.