MLG: మంగపేట మండలం రాజుపేట సబ్స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పనులు పూర్తయ్యాక వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.